మేము ఓక్రిడ్జ్
ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే విద్యార్థిని,విద్యార్థులం అందరం కలిసి 27-9- 2013
శుక్రవారం రోజున అమీర్ పేటలోని శిశు విహార్ కు వెళ్ళాము. అక్కడ పిల్లల్లందరినీ
వారి యొక్క వయస్సును బట్టి విడివిడిగా ప్రత్యేక గదులలో ఉంచి, వారికి చదువు చెబుతూ
ఎంతో బాగా చూసుకుంటున్నారు. అంతేకాక ఒక వయస్సు వచ్చేవరకూ వారిని పెంచి, వారికి ఉద్యోగం
వచ్చి,వారి కాళ్ళమీద వారు నిలదొక్కుకునే వరకు మన ప్రభుత్వం ఆ సంస్థ ద్వారా వారికి చేయూత నిస్తుంది. ఈ సంస్థను మన మాజీ
ముఖ్యమంత్రి శ్రీ అంజయ్యగారు 1981 లో
ప్రారంభించడం జరిగింది. మేము అక్కడికి పుస్తకాలను, తినుబండారాలను, ఇతర అవసర మైన
వస్తువులను తీసుకొని వెళ్ళి వారికి అందచేశాము.వారితో మా సమయాన్ని కేటాయించి,
వారితో కొంత సమయం మాట్లాడి, హాస్యరస సంభాషణల ద్వారా వారిని ఆనందింపజేసాము.
అక్కడి పిల్లలందరూ చాలా అందంగా, ముద్దుగా
ఉన్నారు. అటువంటి వారిని వారి తల్లిదండ్రులు ఎందుకు వదిలేస్తారో మాకు అర్థం
కాలేదు. విద్యార్ధులందరమూ కలిసి మా పాఠశాలకు వచ్చేటప్పుడు ఆ పిల్లల యొక్క స్థితిని
తలుచుకొని ఎంతో బాధపడ్డాము. మన హైదరాబాదు
పట్టణంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. వారందరూ తమకు చేతనైన సహాయాన్ని అందిస్తూ,
కొంతమంది పిల్లలను దత్తత తీసుకొంటే వారి భవిష్యత్తు బాగుపడుతుందని నేను
భావిస్తున్నాను.
ఈపురు.రిషీల్ రెడ్డి,
11 వ, తరగతి,
ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్
No comments:
Post a Comment